25-August-2017

బతుకమ్మ పండుగను పురస్కరించుకుని రాష్ట్రంలోని 18 ఏళ్లు నిండిన పేద మహిళలందరికీ చీరలను కానుకగా ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. రాష్ట్రంలోని 1,04,57,610 మందికి రేషన్ షాపుల ద్వారా సెప్టెంబర్ 18,19,20 తేదీలలో ఈ చీరలు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. కుల, మతాలకు అతీతంగా పేద మహిళలందరికీ చీరలు పంచనున్నట్లు తెలిపారు. పవర్ లూమ్, హ్యాండ్లూమ్ కార్మికులకు ఉపాధి కల్పించడం కోసం వారు నేసిన చీరలనే కొనుగోలు చేసి పంపిణీకి సిద్ధం చేస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు పేద మహిళలందరికీ చీరలందించే విధంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిఎం పిలుపునిచ్చారు. చీరల పంపిణీ కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షించాల్సిందిగా కలెక్టర్లను కేసీఆర్ కోరారు.

బతుకమ్మ కానుకగా చీరలు పంపిణీ చేసే కార్యక్రమంపై ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. పంపిణీ చేసే చీరల నాణ్యతను పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేశారు. చీరలను పంపిణీ చేసే విధానంపై అధికారులతో మాట్లాడారు. షెడ్యూల్ ఖరారు చేశారు. సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎండి సివి ఆనంద్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి. సింగ్, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్ టైల్స్ డైరెక్టర్ శైలజా రామయ్యర్, జాయింట్ డైరెక్టర్ వి.పూర్ణచందర్ రావు, జిఎం పి.యాదగిరి, సిఎంఓ అధికారులు ఎస్. నర్సింగ్ రావు, శాంతకుమారి, స్మితా సభర్వాల్, రాజశేఖర్ రెడ్డి, భూపాలరెడ్డి తదితరులతో సమీక్ష నిర్వహించారు.

‘‘తెలంగాణ ప్రజలంతా కులమతాలకతీతంగా బతుకమ్మ, దసరా పండుగను జరుపుకుంటారు. ఇది రాష్ట్ర పండుగ. తెలంగాణ ప్రజల జీవితాలతో ముడిపడిన పండుగ. కుటుంబ బంధాలకు ఈ పండుగ ప్రతీక. ప్రతీ ఆడపడుచు తన సొంతింటికి వెళ్లి ఆనందంగా జరుపుకునే వేడుక. ఈ పండుగను ప్రజలంతా మరింత సంతోషంగా జరుపుకోవానే ఉద్దేశ్యంతో పేద మహిళలందరికీ చీరలను కానుకగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలకు, క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులకు దుస్తులు పంపిణీ చేశాం. కానీ బతుకమ్మ చీరలను మాత్రం రాష్ట్రంలోని హిందూ, ముస్లిం, క్రైస్తవులతో పాటు అన్ని కులాలు, అన్ని మతాల పేద మహిళలందరికీ చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించాం’’ అని సిఎం ప్రకటించారు.

‘‘మరమగ్గాలు, చేనేత మగ్గాలను ఆధారం చేసుకుని బతికే కార్మికుల పరిస్థితి దారుణంగా ఉంది. పనిలేక కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడే దుస్థితి వచ్చింది. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. అందుకే ఈ చీరలను వారి ద్వారానే కొనుగోలు చేస్తున్నది. దీని ద్వారా కార్మికులకు ఉపాధి దొరుకుతుంది. పనికి హామీ లభిస్తున్నది. బతుకుకు భరోసా ఏర్పడుతున్నది. చీరల పంపిణీ వల్ల మహిళల పండుగ సంబురం రెట్టింపు అవడంతో పాటు నేత కార్మికులు ఉపాధి పొంది సంతృప్తి పడుతున్నారు. ఇది మాకు ఎంతో ఆనందంగా ఉంది. మరమగ్గాలను ఆధునీకరించే పని వేగంగా పూర్తి చేస్తున్నాం. యార్న్, కెమికల్స్ ను 50 శాతం సబ్సిడీపై అందిస్తున్నం. దీని ద్వారా నేత కార్మికులకు లాభం జరుగుతుంది. ఈ చర్యల వల్ల నేత కార్మికులు దుర్భర పరిస్థితి నుంచి బయటపడతారు’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

రాష్ట్రంలో కోటి 4లక్షల పైగా ఉన్న పేద మహిళలకు పంపిణీ చేయడానికి అంతే సంఖ్యలో చీరలు తయారు చేయడానికి ఇప్పటికే ఆర్డర్లు ఇచ్చారు. అవి తయారవుతున్నాయి. ఉత్పత్తి కేంద్రాల నుంచి చీరలు సెప్టెంబర్ రెండో వారంలో జిల్లా కేంద్రాలకు చేరుకుంటాయి. జిల్లా కేంద్రం నుంచి రేషన్ షాపులకు చీరలను పంపుతారు. రేషన్ షాపుల్లో సెప్టెంబర్ 18,19,20 తేదీల్లో మహిళలకు పంపిణీ చేస్తారు. సదరు మహిళ షాపుకు రాలేని పరిస్థితి ఉంటే ఆమె భర్తకానీ, తల్లిగానీ, తండ్రిగానీ తీసుకుపోవచ్చు. రేషన్ షాపుల్లో ఆధార్ కార్డు గానీ, ఓటర్ గుర్తింపు కార్డు కానీ, మరేదైనా ఫోటో గుర్తింపు కానీ చూపించాల్సి ఉంటుంది. ఈ మొత్తం కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్లు పర్యవేక్షిస్తారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులకు లేఖ రాయాలని మంత్రి కేటీఆర్ ను సిఎం ఆదేశించారు. ప్రత్యేక చొరవ తీసుకోవాలని ప్రభుత్వం కోరింది. చీరల పంపిణీ కార్యక్రమంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.సింగ్ శనివారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.

 

24-August-2017

రాష్ర్ట ప్రజలందరికీ, అన్ని ఆవాస ప్రాంతాలకు సురక్షిత మంచినీరు అందివ్వకుంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయననే సవాల్ తీసుకుని మిషన్ భగీరథ పనులు చేస్తున్నాం. దేశంలో ఎవరూ తీసుకొని సవాల్ ను స్వీకరించాం.. దానికి తగినట్లుగా పని చేయాలి. సకాలంలో పనులు పూర్తి చేసి.. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ప్రజలకు సురక్షిత మంచినీరు ఇవ్వాలి అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రజాప్రతినిధులు, అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ప్రగతి భవన్ లో మిషన్ భగీరథ పనుల పురోగతిపై సీఎం కేసీఆర్ మంత్రులు, అధికారులతో కలిసి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. మిషన్ భగీరథ పథకం రాష్ర్ట ప్రభుత్వానికి జీవన్మరణ సమస్య అని తెలిపారు. మిషన్ భగీరథ రాష్ర్ట గౌరవానికి సంబంధించిన అంశమన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, వర్కింగ్ ఏజెన్సీలు రేయింబవల్లు పని చేసి లక్ష్యాన్ని చేరుకోవాలని ఆదేశించారు సీఎం. సకాలంలో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేసి నీరు అందించాలన్నారు. పనుల్లో ఎక్కడ జాప్యం జరిగినా వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని చెప్పారు. తాను స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి మిషన్ భగీరథ పనులు పరిశీలిస్తానని సీఎం తెలిపారు. ప్రజాప్రతినిధులు కూడా మిషన్ భగీరథ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు.

ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, జగదీష్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, మహేందర్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్ రావు, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, సుధీర్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. 

23-August-2017

Hon'ble Chief Minister Sri K. Chandrashekar Rao has instructed the officials to rectify and cleanse the land records in toto in the State so that the land related litigations and issues find a permanent solution in the State. He suggested that the maintenance of land records, registration process should be simplified with utmost transparency. The Chief Minister held a high level meeting on the Comprehensive Land Survey, maintenance of the records, changes in the registration process and other issues at Pragathi Bhavan here today.Deputy CM Sri Mohammed Ali, Ministers Sri Pocharam Srinivas Reddy, Sri Jogu Ramanna, State Planning Commission Vice Chairman Sri Niranjan Reddy, Deputy Speaker Ms. Padma Devender Reddy, Whip Ms. Gongadi Sunitha, Corporations Chairmen Sri Bhoom Reddy, Sri Kishan Rao, Legislators Sri Errabelli Dayakar Rao, Sri K. Vidyasagar Rao, Sri C. Rammohan Reddy, Sri Marri Janardhan Reddy. Sri Manchireddy Kishan Reddy, Sri Bajireddy Goverdhan, Sri Sudhakar Reddy, Government’s Chief Advisor Sri Rajiv Sharma, Advisor Sri KV Ramanachary, Senior Officials Sri BR Meena, Sri BP Acharya, Sri Parthasarathi, Sri Jaganmohan, Sri S. Narsing Rao, Ms. Shanti Kumari, Sri Venkatram Reddy, Ms. Smitha Sabharwal, Ms. Vakati Karuna, Ms. Priyadarshini, Sri Nadeem Ahmed, Sri Bhoopal Reddy, District Collectors Sri Raghunandan Rao, Sri Venkatram Reddy, Sri Sridhar Lokesh Kumar, PCCF Sri Jha, Sri Jayesh Ranjan, Sri Devdas, MDC Chairman Sri Subhash Reddy, Joint Collectors Sri Sunder Abnar, Sri Dharma Reddy, Retired officers Sri N. Srinivas Rao, Sri B. Madhusudhan, Sri D. Venkat Rao and others participated.The meeting discussed the report submitted by a Committee headed by Ranga Reddy district Collector Sri Raghunandan Rao on the methods to be adapted for the cleaning of the land records. The CM said that if the land records are proper and in order, farmers input incentive scheme will be successful. The dates for rectifying the land records, the formation of farmers associations and Farmers conferences are finalised.